తెలుగు భాషా దినోత్సవం..

54
- Advertisement -

దేశ భాషలందు తెలుగు లెస్సా…తెలుగు వ్యవహార భాషా పితామహుడైన గిడుగు రామ్మూర్తి పంతులు.. గ్రాంథిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని వాడుక భాషలోకి తీసుకొచ్చారు. వ్యవహరిక భాషోద్యమానికి ఆయన్ను మూలపురుషుడిగా చెప్పొచ్చు. తెలుగు భాషకు ఎంతో సేవ చేసిన గిడుగు రామ్మూర్తి పంతులు జన్మదినమైన ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్నారు.

గిడుగు వెంకట రామమూర్తి (1863-1940) ఆధునిక తెలుగు భాషానిర్మాతల్లో ముఖ్యుడు. ఉపాధ్యాయుడు, చరిత్ర, శాసన పరిశోధకుడు, వక్త, విద్యావేత్త. ఆధునిక తెలుగు సాహిత్యానికి వైతాళికులని చెప్పదగ్గ ముగ్గురిలో.. వీరేశలింగం, గురజాడలతో పాటు గిడుగు కూడా ఒకరు. ఆయన తన జీవితకాలంలో అనేక జీవితాలపాటు చేయవలసిన మహోద్యమాలెన్నో చేపట్టారు.

జాతి ద్వారా భాషకు, భాష ద్వారా జాతికి ఒక విశిష్టమైన గౌరవం ఏర్పడుతుంది. ఒక జాతి పురోగమన మార్గమును తల్లిభాష ముందుండి నడిపిస్తుంది. తెలుగును రక్షించి, అభివృద్ధి పథంలో నడిపిస్తూ.. తెలుగు వెలుగులను ఎంతోమంది ప్రాచుర్యంలోకి తెచ్చారు. రాయప్రోలు, త్రిపురనేని, చిలకమర్తి, పానుగంటి, ఉన్నవ, విశ్వనాథ, శ్రీ శ్రీ, కాళోజీ, సినారె మొదలగు ఎందరో కవులు తెలుగు సాహిత్యాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చారు.

ఒక భాషకు ప్రాధాన్యత తగ్గితే దాని చుట్టూ వేలాది సంవత్సరాల చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు కూడా తెరమరుగవుతాయి. వేరుకు చెదలు పడితే మహా వృక్షమైనా నేల కూలక తప్పదు. పరిస్థితి మన భాషకు రాకముందే అంతా మేలుకుంటే మంచిది.

Also Read:ఎన్టీఆర్ చాలా నేర్చుకోవాలి!

- Advertisement -