తెలుగు హీరోలూ..ఆ హీరోని ఫాలో కాండి

35
- Advertisement -

టాలీవుడ్‌ తో పాటు అటు కోలీవుడ్ లోనూ ప్రస్తుతం రీరిలీజ్ ట్రెండ్ కొనసాగుతోంది. ఐతే, తమిళ స్టార్ హీరో సూర్యకు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. ఆయన సినిమాలు మన దగ్గర కూడా మంచి హిట్స్ గా నిలిచాయి. సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇక, ఇప్పుడు ఈ సినిమా ఈరోజు (ఆగస్టు 4)న రీ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకు గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించగా హారిస్ జయరాజ్ సంగీతాన్ని అందించారు. అయితే, ఈ సినిమా చాలా థియేటర్లలో రీరిలీజ్ అయ్యింది. ఇప్పటికే బుకింగ్స్ కూడా జోరుగా సాగుతున్నాయి.

ఐతే, గ‌తంలో ఏ సినిమా రీరిలీజ్‌కు కూడా జ‌రగ‌ని ప్లానింగ్స్‌తో ఈ సినిమా రిలీజ్ అయింది. అందుకే, ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాలతో స‌హా ఇత‌ర అన్ని ప్రాంతాల్లో కూడా బుకింగ్స్ ఓపెన్ చేసిన వెంట‌నే హౌస్‌ ఫుల్ బోర్డ్స్ ప‌డిపోతున్నాయని అంటున్నారు. ఈ వారం పెద్ద సినిమాలేవీ లేకపోవడం కూడా ఈ సినిమాకి బాగా కలిసి వచ్చింది. చూస్తుంటే ఈ సినిమా తమిళంలో రీరిలీజ్ మూవీస్‌ లో రికార్డు సృష్టిస్తుందేమో అనిపిస్తుంది. అన్నట్టు సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ సినిమాకు వచ్చే కలెక్షన్లను ఓ మంచి పని కోసం ఉపయోగిస్తున్నారట.

Also Read:పవన్ నెత్తిన మరొకటి.. పరిస్థితి ఏమిటి ?

పేదరికంతో బాధపడుతున్న సూర్య ఫ్యాన్స్‌కు ఈ కలెక్షన్లను పంచుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా సూర్య అనాధ పిల్లలను చదివిస్తూ ఉంటాడు. ఇప్పుడు పేద అభిమానుల పిల్లలను కూడా చదివించాలని సూర్య ప్లాన్ చేసుకుంటున్నాడు. మొత్తానికి సూర్య చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఎందరో అభిమానులు ఉన్నారు. సూర్య లాగే మన తెలుగు హీరోలు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తే.. ఎందరికో ఉపయోగ పడుతుంది. మరి మన హీరోలు కూడా ఆ దిశగా అడుగులు వేయాలని ఆశిద్దాం.

Also Read:రోజు నిమ్మరసం తాగుతున్నారా?

- Advertisement -