అమెరికా ఉమెన్‌ క్రికెట్‌ టీంలో తెలంగాణ అమ్మాయి

321
telugu girl in america women cricket team
telugu girl in america women cricket team
- Advertisement -

అమెరికాలో పలు రంగాల్లో తెలుగువాళ్లు సత్తా చాటుతున్న సంగతి తెసిందే. తాజాగా అమెరికా జాతీయ మహిళా క్రికెట్ టీంలో హైదరబాద్‌కు చెందిన తెలంగాణ అమ్మాయి ఎంపికైంది. ఆగస్టులో జరిగే వరల్డ్‌ టీ20 క్వాలిఫైయింగ్‌ మ్యాచ్‌లో స్కాట్లాండ్‌లో తలపడనుంది. ఈ టీంకు 26 ఏళ్ల సింధూజా రెడ్డి ప్రాతినిధ్యం వహించనుంది.

గ‌తంలో హైద‌రాబాద్ టీమ్‌కు ఆడిన సింధుజా.. వికెట్ కీపింగ్ బ్యాట్స్‌వుమ‌న్‌గా ఇప్పుడు అమెరికా టీమ్‌కు ఎంపికైంది. సింధూజా సొంతూరు న‌ల్ల‌గొండ జిల్లాలోని ఆమ‌న్‌గ‌ల్. ఈ మ‌ధ్యే సిద్ధార్థ్ రెడ్డి అనే వ్య‌క్తిని పెళ్లి చేసుకున్న సింధూజా.. అమెరికాలో స్థిర‌ప‌డింది.

హైద‌రాబాద్ అండ‌ర్ 19 క్రికెట్ టీమ్‌కు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించిన సింధూజా.. 2020లో జ‌రిగే ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో అమెరికాకు ప్రాతినిధ్యం వ‌హించనుంది. సింధూజా బీటెక్‌, ఎంబీఏ పూర్తి చేసింది. పెళ్లి త‌ర్వాత క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాల‌నుకున్నా.. అనుకోకుండా అమెరికాలో ఈ అవ‌కాశం వ‌చ్చింది. 12 ఏళ్ల వయస్సులోనే క్రికెట్‌ ఆడడం ప్రారంభించిన ఆమె 14 ఏళ్లపాటు హైదరాబాద్‌ అండర్‌-16, అండర్‌-19 జట్లకు కీపర్‌, ఓపెనింగ్‌ బ్యాట్స్‌ఉమన్‌గా ప్రాతినిధ్యం వహించింది.

తొలుత విజయ్‌కుమార్‌ వద్ద ఆపై భారత జట్టు మాజీ కెప్టెన్‌ పూర్ణిమారావు వద్ద శిక్షణ పొందింది. వివాహం అనంతరం అమెరికా వెళ్లిపోయిన ఆమె కొద్దికాలం తర్వాత మళ్లీ క్రికెట్‌ బ్యాట్‌ చేతపట్టింది. లోకల్‌ క్లబ్‌ మ్యాచ్‌ల్లో సత్తా చూపి జాతీయ జట్టు సెలెక్షన్‌ ట్రయల్స్‌కు ఎంపికైంది. సింధూజా నేష‌న‌ల్ టీమ్‌కు ఎంపికైంద‌ని తెలుసుకొని ఆమె తల్లిదండ్రులు సంతోషం వ్య‌క్తంచేశారు. చిన్న‌ప్ప‌టి నుంచి ఆమెకు క్రికెట్ అంటే చాలా ఇష్ట‌మ‌ని, స్కూల్ టీమ్‌లోనూ ఆడింద‌ని ఆమె తండ్రి స్పర్‌ధ‌ర్ రెడ్డి తెలిపారు.

- Advertisement -