- Advertisement -
నితిన్ హీరోగా నటిస్తున్న చిత్రం రాబిన్ హుడ్. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నితిన్ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ మూవీతోనే తెరంగేట్రం చేస్తున్నాడు. ఈ చిత్రం ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.
సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఈ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఓ వీడియోను విడుదల చేసింది.ఈ వీడియోలో డేవిడ్ వార్నర్‌కు హీరో నితిన్, హీరోయిన్ శ్రీలీల తెలుగు నేర్పిస్తున్నారు.
జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందిస్తుండగా.. రాజేంద్రప్రసాద్, వెన్నెల కిశోర్, షైన్ టామ్ చాకో కీలక పాత్రలను పోషిస్తున్నారు.
- Advertisement -