కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి షాక్ తగిలింది. పొంగులేటి ప్రధాన అనుచరుడు,భద్రాచలం నియోజకవర్గ నేత తెల్లం వెంకట్రావ్ కాంగ్రెస్‌ను వీడేందుకు రంగం సిద్ధమైంది. భద్రాచలం సీటును ఆశించిన తెల్లంకు సిట్టింగ్ ఎమ్మెల్యే పోదెం వీరయ్య రూపంలో చెక్ పడటంతో హస్తాన్ని వీడి కారెక్కెందుకు సిద్ధమయ్యారు. ఇవాళ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్సీ తాతా మధుతో కలిసి హైదరాబాద్‌కు రానున్న వెంకట్రావ్…మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. తెల్లంతోపాటు దుమ్ముగూడెం జడ్పీటీసీ తెల్లం సీతమ్మ కూడా బీఆర్‌ఎస్ కండువా కప్పుకోనున్నారు.
2014లో మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ తరఫున పోటీచేసి ఓడిపోయారు. అనంతరం బీఆర్‌ఎస్‌లో చేరి బీఆర్‌ఎస్ భద్రాచలం ని యోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్నారు. 2018 సాధారణ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. రానున్న రోజుల్లో మరికొంతమంది కూడా పొంగులేటికి షాకిచ్చి బీఆర్ఎస్‌లో చేరనున్నట్లు సమాచారం.
Also Read:చంద్రబాబు అంచనాలన్నీ తారుమారు?