తెలంగాణలో ఐఏఎస్‌ల బదిలీలు..

26
- Advertisement -

తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్రంలో 15 మంది అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులపై సంతకం చేసింది. మంచిర్యాల కలెక్టర్‌ భారతి హొళికెరిని మహిళా శిశు సంక్షేమశాఖ స్పెషల్‌ సెక్రెటరీగా నియమించింది. హన్మకొండ కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హన్మంతును నిజామాబాద్‌కు బదిలీ చేసింది.

అమయ్‌కుమార్‌ను మేడ్చల్‌ మల్కాజ్‌గిరి కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఆదిలాబాద్‌ కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ను హన్మకొండకు, కుమ్రంభీం కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ను ఆదిలాబాద్‌ కలెక్టర్‌గా పంపింది. నారాయణరెడ్డిని వికారాబాద్‌ కలెక్టర్‌గా, వనపర్తి కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ భాషాను కుమ్రంభీం ఆసిఫాబాద్‌కు, మెదక్‌ కలెక్టర్‌ ఎస్‌ వెంకట్రావును సూర్యాపేట కలెక్టర్‌గా, ఎస్‌ హరీశ్‌రాను రంగారెడ్డి, రాజశ్రీ షాను మెదక్‌ కలెక్టర్‌గా నియమించింది.

మహబూబ్‌నగర్‌ అడిషనల్‌ కలెక్టర్‌ తేజ ఎస్‌ పవార్‌ వనపర్తి కలెక్టర్‌గా, ఉట్నూరు ఐటీడీఏ పీవో క్రాంతి వరుణ్‌రెడ్డి నిర్మల్‌ కలెక్టర్‌గా, కరీంనగర్‌ కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌కు జగిత్యాల కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది.

ఇవి కూడా చదవండి…

జోగులాంబదేవి..సీఎం సతీమణికి ప్రసాదం

జూన్‌లో మెయిన్స్ పరీక్షలు…

శాండోస్‌…గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్‌

- Advertisement -