ఈ రోజు శాసనమండలి సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయంలో భాగంగా యూరేనియం తవ్వకాలపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానమిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం యూరేనియం మైనింగ్‌కు సంబంధించి నల్లమలలో ఎలాంటి అనుమతి ఇవ్వలేదని, ఇవ్వబోదని ఆయన స్పష్టం చేశారు. దీనిపై ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు తాజాగా స్పందిస్తూ.. నల్లమల యూరేనియం మైనింగ్‌కు సంబంధించి మంత్రి కేటీఆర్ నిర్ణయానికి ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా బాలరాజు మీడియాతో మాట్లాడుతూ.. ఈ రోజు మండలిలో మంత్రి కేటీఆర్ ఇచ్చిన స్పష్టత మాకు మరింత ధైర్యం ఇచ్చింది. గతంలో కాంగ్రెస్ ఇచ్చిన అనుమతిని మంత్రి చెప్పారు. మంత్రి ఇచ్చిన సమాధానంతో కాంగ్రెస్ పెద్దలు నిజాలు తెలుసుకోవాలని బాలరాజు అన్నారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇది సరిపోతుంది అనుకుంటున్న.. ఎందుకంటే కాంగ్రెస్ నేతలు మేము అనుమతి ఇచ్చాము అంటున్నారు. కానీ మా మంత్రి కేటీఆర్ కూడా నల్లమల్ల బాధ్యత మాది అని చెప్పారు. కేంద్రప్రభుత్వంలో ఎవరు ఉన్న మేము యూరేనియం తవ్వకాలకు అనుమతి ఇవ్వం అని మంత్రి కేటీఆర్ చెప్పడం గొప్ప నిర్ణయం అన్నారు.
హరిత హారం ప్రియుడు మా ముఖ్యమంత్రి హరితహారం కార్యక్రమం చేస్తున్నారు. హరితహారంను గొప్ప కార్యక్రమంగా ముందుకు తీసుకుపోతున్న తరుణంలో ఇలాంటి హామీ మాకు మంచి అండగా ఉంటుందని చెప్తున్నాను. రాష్ట్ర మంత్రి కేటీఆర్, ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు అని బాలరాజు అన్నారు.
దీనిపై రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాట్లు అవసరం లేదు. మా ప్రభుత్వం అవసరం అయితే ఉద్యయం కూడా చేస్తాం అని మా మంత్రి కేటీఆర్ చెప్పారు.ప్రజల వ్యతిరేక పనులు ఎక్కడ చెయ్యాదు ఉద్యయం నుండి వచ్చిన మా పార్టీ ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుందని చెప్తున్నాను. అని బాలరాజు తెలిపారు.
ఆచంపేట్ నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతున్న.. నాకు నా నియోజకవర్గ ప్రజలు అండగా ఉన్నారు నేను వారికి తోడుగా ఉండి ఉద్యయం చేస్తా అని నిన్ననే చెప్పాను.మండలిలో మంత్రి మాట్లాడారు అవసరం అయితే ముఖ్యమంత్రి చేత కూడా సభలో నల్లమల్లపై వివరణ ఇచ్చేలా చేస్తాను అని. మండలిలో మాకు అండగా ఉన్న మంత్రి కేటీఆర్‌కి ధన్యవాదాలు తెలిపారు గువ్వల బాల రాజు.
#SaveNallamala
Yes Nallamala is safe.
Don't worry.Thanks @KTRTRS Sir.@KTRTRS @trspartyonline @TelanganaCMO https://t.co/abwpKgV6V4
— Guvvala Balaraju (@GBalarajuTrs) September 15, 2019
యురేనియం తవ్వకాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకమే అని శాసన మండలిలో స్పష్టం చేసిన మంత్రి కేటీఆర్ గారు.
It's crystal clear now, there is no permission from the Government of Telangana for Uranium Mining at Nallamala. @KTRTRS @trspartyonline @TelanganaCMO pic.twitter.com/K7v1YgpPWn— Guvvala Balaraju (@GBalarajuTrs) September 15, 2019