తెలంగాణ వెదర్ అప్‌డేట్….

29
Weather Forecast

రానున్న రెండు రోజులకు తెలంగాణ వెదర్ అప్ డేట్‌ని అందించింది హైదరాబాద్ వాతావరణ శాఖ. నిన్నటి నుంచి ఉన్న ఉత్తర- దక్షిణ ఉపరితల ఆవర్తనం, ఈ రోజు ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక నుండి దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక మీదగా దక్షిణ కేరళ వరకు సముద్ర మట్టానికి 0.9కిమి ఎత్తు వరకు కొనసాగుతుంది.

దీని ఫలితంగా రానున్న రెండు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రేపు, ఎల్లుండి (29,30వ తేదీలు) రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు మరియు ఈదురుగాలులతో కూడిన లికపాటి నుండి మోస్తరు వర్షములు ఒకటి, రెండు ప్రదేశములలో వచ్చే అవకాశం ఉందని తెలిపింది.