వచ్చే నాలుగు వారాలు కీలకం: శ్రీనివాస్ రావు

382
srinivasarao
- Advertisement -

కరోనా కట్టడికి రానున్న మూడు, నాలుగు వారాలు కీలకమన్నారు రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాస్ రావు. హైదరాబాద్ కోఠిలోని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్‌ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన శ్రీనివాస్ రావు…క‌రోనా క‌ట్ట‌డికి రాష్ర్ట ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌లు స‌త్ఫ‌లితాలు ఇస్తున్నాయని చెప్పారు.

మే నెల‌ఖారు వ‌ర‌కు అంద‌రూ జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని……మాస్క్ త‌ప్ప‌నిస‌రిగా ధ‌రించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ఇక నుంచి మ‌రింత జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించారు. వ‌చ్చేది పెళ్లిళ్లు, పండుగ‌ల సీజ‌న్ కాబట్టి మ‌రింత జాగ్ర‌త్త‌గా ఉండాల‌న్నారు. జాగ్ర‌త్త‌ల విష‌యంలో ప్ర‌జ‌ల్లో అల‌స‌త్వం ప‌నికి రాదు అన్నారు.

ప్ర‌స్తుతం రాష్ర్టంలో 95 శాతం వ‌ర‌కు రిక‌వ‌రీ రేటు ఉంద‌న్నారు. మొద‌టి ద‌శ‌లో దేశంలోనే అత్య‌ధికంగా 99.5 శాతం రిక‌వ‌రీ రేటు మ‌న‌ది అని పేర్కొన్నారు. రాష్ర్టంలో 50 వేల‌కు పైగా ప‌డ‌క‌లు ఏర్పాటు చేశామ‌ని తెలిపారు. 18 వేల‌కు పైగా ఆక్సిజ‌న్ ప‌డ‌క‌లు, 10 వేల‌కు పైగా ఐసీయూ ప‌డ‌క‌లు ఉన్నాయ‌న్నారు. ఏడాదిన్న‌ర‌గా ప్ర‌జారోగ్య సిబ్బంది అలుపెర‌గ‌ని పోరాటం చేస్తున్నారు.

- Advertisement -