మళ్లీ ఛాన్స్ దొరికితే…ఖచ్చితంగా చేస్తా: రష్మికా

66
rashmika

తన అందం,నటనతో టాలీవుడ్,కోలీవుడ్‌లలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి రష్మిక మందన్నా. తన క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో అగ్రహీరోలతో నటిస్తూ మెప్పిస్తున్న రష్మికా….ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

ఇక టాలీవుడ్‌లో విజయ్ దేవరకొండ- రష్మిక జోడీకి ఉన్న క్రేజే వేరు. ఇండస్ట్రీకి వచ్చి రావడంతోనే ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కాగా ఈ జంట మరోసారి కలిసి నటించే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్న తరుణంలో రష్మిక స్పందించింది.

సరైన కథ​ దొరికితే, విజయ్​తో మరోసారి కచ్చితంగా నటిస్తానని తెలిపింది. దీనికోసం తానెంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నట్లు రష్మిక చెప్పింది. రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన పుష్ప సినిమాలో నటిస్తోంది.