వినోద్ కుమార్ ను కలిసిన కొంకన్‌ బ్యాంబు బృందం

544
Vinod Kumar
- Advertisement -

మహారాష్ట్రలోని కొంకన్ బ్యాంబు అండ్ కేన్ డెవలప్మెంట్ సెంటర్ డైరెక్టర్, సెంటర్ ఫర్ ఇండియన్ బ్యాంబు రిసోర్స్ అండ్ టెక్నాలజీ ( సిబార్ట్ ) డైరెక్టర్ సంజీవ్ ఎస్ కార్పె నేతృత్వంలోని ప్రతినిధుల బృందం రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ను కలిశారు. ఈసందర్భంగా కుడాల్ బ్యాంబు క్షేత్రాన్ని పరిశీలించేందుకు గోవా పర్యటనకు రావాల్సిందిగా వారు వినోద్ కుమార్ ను ఆహ్వానించారు. అందుకు వినోద్ కుమార్ సానుకూలంగా స్పందించారు.

తెలంగాణ రాష్ట్రంలోనూ బ్యాంబు సాగుకు వాతావరణం అనుకూలంగా ఉందని, ఇక్కడి రైతులు కూడా బ్యాంబు సాగుకు మొగ్గుచూపుతున్నారని వినోద్ కుమార్ కొంకన్ బృందానికి తెలిపారు. కర్ణాటక, గోవా సరిహద్దుల్లోని కుడాల్‌ ప్రాంతంలో 15వేల ఎకరాల్లో బ్యాంబు సాగు చేస్తున్నట్లు కొంకన్‌ బృందం తెలిపింది. సాగుచేసిన రైతులు ఎకరానికి రూ.లక్ష ఆదాయం పొందుతున్నారని చెప్పారు. ఈ భేటీలో రాష్ట్ర హార్టికల్చర్ కమిషనర్ లోక వెంకట్రాంరెడ్డి , డిప్యూటీ డైరెక్టర్ బాబు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -