- Advertisement -
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్తున్న ప్రయాణికులకు తెలంగాణ సర్కారు శుభవార్త చెప్పింది. జాతీయరహదారిపై టోల్‌గేట్ల వసూళ్లను రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ప్రకటన విడుదల చేశారు. ఆదివారం (జనవరి 13), బుధవారం (జనవరి 16) టోల్ వసూళ్లు ఉండవని స్పష్టంచేశారు. పండుగ వేళ విపరీతమైన రద్దీ ఉండటం, టోల్‌గేట్ల వద్ద ఆలస్యానికి ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడుతుండటంతో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు, జాతీయ రహదారుల అధికారులతో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
అయితే ఈ ఆదేశాలను టోల్ సిబ్బంది పాటించడం లేదు. పంతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు టోల్‌గేట్ల వద్ద రుసుములు వసూలు చేస్తున్నారు. తమకు రద్దు ఆదేశాలు రాలేదంటూ చెబుతున్నారు. ప్రభుత్వ ఆదేశాలు రాష్ట్రరహదారులకే పరిమితం అని.. ఎన్‌హెచ్‌ఐ నుంచి ఆదేశాలు రాలేదని టోల్‌ప్లాజాల నిర్వాహకులు అంటున్నారు.
- Advertisement -