తొలి వన్డేలో భారత్‌ ఓటమి..

232
India vs Australia

శనివారం తొలి వన్డేలో భారత్‌ 34 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. మొదట ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. ఆరంభంలో తడబడ్డ ఆసీస్‌ను ఖవాజా (59; 81 బంతుల్లో 6×4), షాన్‌ మార్ష్‌ (54; 70 బంతుల్లో 4×4) ఆదుకోగా.. హాండ్స్‌కాంబ్‌ (73; 61 బంతుల్లో 6×4), స్టాయినిస్‌ (47 నాటౌట్‌; 43 బంతుల్లో 2×4, 2×6) మెరుపులతో ఆతిథ్య జట్టు మెరుగైన స్కోరు సాధించింది.

అనంతరం 4 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ భారత్‌ను ధోనితో కలిసి రోహిత్‌ రక్షించే ప్రయత్నం చేశాడు. ధోని వెనుదిరిగాక కూడా పోరాటాన్ని కొనసాగించి భారత్‌ను గెలిపించేందుకు విశ్వ ప్రయత్నం చేశాడు. కానీ చివర్లో అతను వెనుదిరగడంతో టీమ్‌ఇండియా అవకాశాలకు తెరపడింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ జే రిచర్డ్‌సన్‌తో పాటు బెరెన్‌డార్ఫ్‌ (2/39) కూడా భారత్‌ను దెబ్బ తీశాడు. రెండో వన్డే మంగళవారం అడిలైడ్‌లో జరుగుతుంది.

India vs Australia

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌: కేరీ (సి) రోహిత్‌ (బి) కుల్‌దీప్‌ 24; ఫించ్‌ (బి) భువనేశ్వర్‌ 6; ఖవాజా ఎల్బీ (బి) జడేజా 59; షాన్‌ మార్ష్‌ (సి) షమి (బి) కుల్‌దీప్‌ 54; హాండ్స్‌కాంబ్‌ (సి) ధావన్‌ (బి) భువనేశ్వర్‌ 73; స్టాయినిస్‌ నాటౌట్‌ 47; మ్యాక్స్‌వెల్‌ నాటౌట్‌ 11; ఎక్స్‌ట్రాలు 14 మొత్తం: (50 ఓవర్లలో 5 వికెట్లకు) 288;

వికెట్ల పతనం: 1-8, 2-41, 3-133, 4-186, 5-254;

బౌలింగ్‌: భువనేశ్వర్‌ 10-0-66-2; ఖలీల్‌ అహ్మద్‌ 8-0-55-0; షమి 10-0-46-0; కుల్‌దీప్‌ యాదవ్‌ 10-0-54-2; జడేజా 10-0-48-1; రాయుడు 2-0-13-0.

భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి) మ్యాక్స్‌వెల్‌ (బి) స్టాయినిస్‌ 133; ధావన్‌ ఎల్బీ (బి) బెరెన్‌డార్ఫ్‌ 0; కోహ్లి (సి) స్టాయినిస్‌ (బి) రిచర్డ్‌సన్‌ 3; రాయుడు ఎల్బీ (బి) రిచర్డ్‌సన్‌ 0; ధోని ఎల్బీ (బి) బెరెన్‌డార్ఫ్‌ 51; కార్తీక్‌ (బి) రిచర్డ్‌సన్‌ 12; జడేజా (సి) షాన్‌ మార్ష్‌ (బి) రిచర్డ్‌సన్‌ 8; భువనేశ్వర్‌ నాటౌట్‌ 29; కుల్‌దీప్‌ (సి) ఖవాజా (బి) సిడిల్‌ 3; షమి (సి) మ్యాక్స్‌వెల్‌ (బి) స్టాయినిస్‌ 1; ఎక్స్‌ట్రాలు 14 మొత్తం: (50 ఓవర్లలో 9 వికెట్లకు) 254;

వికెట్ల పతనం: 1-1, 2-4, 3-4, 4-141, 5-176, 6-213, 7-221, 8-247, 9-254;

బౌలింగ్‌: బెరెన్‌డార్ఫ్‌ 10-2-39-2; రిచర్డ్‌సన్‌ 10-2-26-4; సిడిల్‌ 8-0-48-1; లైయన్‌ 10-1-50-0; స్టాయినిస్‌ 10-0-66-2; మ్యాక్స్‌వెల్‌ 2-0-18-0