వీఆర్వో వ్యవస్ధ రద్దు..

127
kcr

సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కొత్త రెవెన్యూ చట్టం తీసుకురావడంలో భాగంగా రెవెన్యూ వ్యవస్ద ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా వీఆర్వో వ్యవస్థను రద్దు చేశారు.వీఆర్వోల చేతిలో ఉన్న రికార్డులన్నీ స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయగా ఇందుకు సంబంధించిన ప్రక్రియ పూర్తయింది. కలెక్టర్లు సైతం సమగ్ర నివేదికను సీఎస్‌కు అందజేశారు.

గత కొంతకాలంగా చూస్తు రెవెన్యూ శాఖలో ఎక్కడ చూసినా అవినీతి భారీగా పెరిగిపోయింది. దీంతో ఏసీబీ జరిగిన దాడుల్లో వీఆర్వోల వద్దే పెద్ద ఎత్తున లక్షల్లో డబ్బు దొరుకుతుంది. ఇక రెవెన్యూలో ఏ పని జరగాలన్నా వీఆర్వో కీలక పాత్ర ఉంటుంది. 95 రకాల విధులు వీఆర్వో నిర్వర్తిస్తుంటారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలు కూడా వీఆర్వో దగ్గరుండి చూడాలి. గ్రామస్థులు దగ్గరుండి మరీ వీఆర్వో పనిచేస్తారు వీఆర్వో సంతకం చేస్తేనే సర్టిఫికెట్లు జారీ అవుతాయి.

ఈ నేపథ్యంలో మెజార్టీ వీఆర్వోలు లంచాలకు అలవాటు పడి ప్రజలను పీక్కుతిన్నారు. ఈ నేపథ్యంలో వీఆర్వో వ్యవస్ధను రద్దుచేయాలని భావించింది ప్రభుత్వం. ఇందుకు సంబంధించిన బిల్లును ఎల్లుండి అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.రాష్ట్రవ్యాప్తంగా 7172 మంది వీఆర్వో పోస్టులు ఉండగా.. అందులో ఐదువేలమంది మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. మిగతా పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి.