బిగ్ బాస్ లొల్లి షురూ…కరాటే కల్యాణి వర్సెస్ సుజాత!

145
big boss

బిగ్ బాస్ సీజన్‌ 4 ప్రారంభమైన సంగతి తెలిసిందే. 15 వారాల పాటు బిగ్ బాస్ సీజన్ జరగనుండగా 16 మంది కంటెస్టెంట్‌లు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక తొలివారం ఎలిమినేషన్ ఉంటుందని షో హోస్ట్ నాగార్జున తెలపగా అప్పుడే బిగ్ బాస్‌ సీజన్ 4లో లొల్లి షురూ అయింది.

ఎలిమినేషన్ ప్రాసెస్‌లో భాగంగా కరాటే కల్యాణి,సుజాత మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. సుజాత తన మనసులో మాటను చెబుతున్న సందర్భంలో మధ్యలో కల్పించుకున్న కరాటే కల్యాణి అడ్డుచెప్పే ప్రయత్నం చేసింది.దీంతో మధ్యలో కల్పించుకున్న సూర్య కిరణ్ ఇద్దరికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.