KTR:పారిశ్రామిక ప్రగతిలో తెలంగాణ టాప్

41
- Advertisement -

వయసులో అతి చిన్న రాష్ట్రమైన రాష్ట్ర ప్రగతి పారిశ్రామిక ప్రగతిలో తెలంగాణ నెంబర్‌వన్‌గా నిలిచిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. చౌటుప్పల్ మండలం దండుమల్కాపూర్ గ్రీన్ ఇండస్ట్రీయల్ పార్కులో ఏర్పాటు చేసిన తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో పారిశ్రామిక ప్రగతి సాధించిందన్నారు. అన్ని రంగాల్లో అత్యద్భుతంగా పురోగతి సాధించిందని తెలిపారు.

Also Read: రానున్న మూడు రోజులు వానలు..ఐదు రోజులు ఎండలు

తెలంగాణలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో సమగ్ర సమతుల్యత సమ్మిళత అభివృద్ధి జరిగిందని కేటీఆర్ తెలిపారు. పరిశ్రమల ఏర్పాటులో అత్యంత పారదర్శకంగా ప్రణాళికలను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. టీఎస్ఐపాస్ ద్వారా 15రోజుల్లో అనుమతులు ఇస్తున్నామని పేర్కొన్నారు. అమెరికాలో కూడా ఇలాంటి విధానం కూడా లేదని పారిశ్రామిక వేత్తలకు గుర్తు చేశారు. 60యేళ్లలో జరగని పనిని కేవలం తొమ్మిదేళ్ల కాలంలో జరిగిందని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రపంచానికి ఒక పాఠం మాదిరిగా మారిందని అన్నారు. ఇది తెలంగాణ ప్రజలకు దక్కిన గొప్ప గౌరవం అని కేటీఆర్ స్పష్టం చేశారు.

Also Read: తెలంగాణలో బాబు ప్లానేంటి ?

- Advertisement -