ఇండియన్-2లో విలన్ అతడే !

21
- Advertisement -

లోకనాయకుడు కమల్ హాసన్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘ఇండియన్ 2’. ఈ సినిమాకు సంబంధించి ఓ టాక్ వినిపిస్తోంది. ఈ మూవీలో కమల్‌ది పవర్ ఫుల్ రోల్ కాబట్టి.. దాన్ని ఢీ కొట్టే మెయిన్ విలన్ పాత్రలో వెర్సటైల్ నటుడు ఎస్ జె సూర్య నటిస్తున్నట్టు కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే, ఎస్.‌జె సూర్య షూటింగ్ కూడా పూర్తి చేసుకున్నట్టు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. భారతీయుడు చేసే పోరాటాన్ని తనదైన శైలిలో ఎటాక్ చేస్తూ ఎస్.‌జె సూర్య తన విలనిజాన్ని చూపిస్తాడట.

అయితే, సెకండ్ హాఫ్ లో ఎస్.‌జె సూర్య పాత్రను చంపుతారని తెలుస్తోంది. మొత్తమ్మీద ఎస్.‌జె సూర్య ఓ పవర్ ఫుల్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. ఇక ప్రస్తుతం ఇండియన్ 2 కోసం కమల్ హాసన్ గ్యాప్ లేకుండా షూట్ లో పాల్గొంటున్నారు. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, సముద్రఖని, బాబీ సింహా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ రెడ్ జెయింట్ మూవీస్ సహకారంతో ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తోంది.

Also Read: జూన్ 8:#NBK108 టైటిల్, ఫస్ట్ లుక్

మధ్యలో ఆగిపోయిన ఈ సినిమా మళ్లీ కమల్ హాసన్ ప్రమేయంతో మొదలు అయ్యింది. దర్శకుడు శంకర్ ఈ సినిమా కోసం రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా షూట్ కి మధ్యలో బ్రేక్ ఇచ్చి.. ఇండియన్ 2 పై కసరత్తులు చేస్తున్నాడు. కమల్ కెరీర్ కు ‘విక్రమ్’ రూపంలో భారీ బూస్టప్ వచ్చింది. ఆ ఊపే ఇండియన్ 2 కి కూడా ఉపయోగపడుతుంది అని అంటున్నారు. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి.

Also Read: హనుమంతుడి కోసం ఓ సీట్

- Advertisement -