ప్రోగ్రెసివ్ ,పాజిటివ్, ప్రాక్టీస్…ప్రజల కోణంలో ఆలోచించేది తెలంగాణ ప్రభుత్వం అన్నారు మంత్రి ఈటల రాజేందర్. సోమాజిగూడ లోని పార్క్ హోటల్ లో టైమ్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన “హార్ట్ ఫెయిల్యూర్ కాన్ఫరెన్స్” కార్యక్రమంలో పాల్గొన్న ఈటల హైదరాబాద్ మెడికల్ హబ్ …ఇక్కడ తక్కువ ధర ఉందని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వారు ఇక్కడికి వైద్యం కోసం వస్తున్నారని చెప్పారు.
ప్రమోటివ్, క్యూరేటివ్, ప్రివెంటివ్ అనే మూడు అంశాల్లో ప్రభుత్వం వైద్యం ఆరోగ్యంపై దృష్టి పెట్టిందన్నారు.ఆరోగ్య శ్రీ ద్వారా ప్రైవేట్ హాస్పిటల్ కి కూడా ప్రభుత్వం చేయూత అందిస్తుందన్నారు. ఎకో కార్డియో గ్రామ్ మిషన్ లు ఒస్మానియా, గాంధీ అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఏర్పాటు చేశామన్నారు. అన్ని మెడికల్ కాలేజీల్లో అన్ని పరీక్షలు అందుబాులోకి తీసుకువచ్చా మని వెల్లడించారు. రాష్ట్రంలో ఉన్న 23 ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కూడా అన్ని సదుపాయాలు ప్రజలకు అందుబాటులో ఉండేలా చూస్తామన్నారు.
ప్రోగ్రెసివ్ ,పాజిటివ్, ప్రాక్టీస్, ప్రజల కోణంలో ఆలోచించేది తెలంగాణ ప్రభుత్వం… మా లక్ష్యం ఆరోగ్య తెలంగాణ, జ్ఞాన వంతమై న రాష్ట్రమన్నారు. 1.5 కోట్ల మందికి కంటి పరీక్షలు చేయించాం…. నాణ్యమైన మాన్ పవర్ ఉన్న కోసం తాపత్రయ పడుతున్నాం…. తెలంగాణ ఆరోగ్య రంగంలో దేశానికే రోల్ మోడల్ గా తీర్చి దిద్దుతామని వెల్లడించారు.
హైదరాబాద్ లో 149 అర్బన్ హెల్త్ సెంటర్స్, 106 బస్తీ దావాఖాన ఏర్పాటు చేశాం…కేవలం రెండు రోజుల్లో 7.5 లక్షల మందికి బ్లడ్ స్క్రీనింగ్ చేశామని చెప్పారు ఈటల. 7500 కోట్ల బడ్జెట్ వైద్య ఆరోగ్యం కోసం కేటాయించామని పైసలకు కొదవ లేదన్నారు. గుండె జబ్బులు ఇంతకు ముందు డబ్బులున్న వాళ్ళలో వచ్చేవి ఇప్పుడు పేద వారిలో కూడా ఎక్కువ అయ్యాయి అవి ఎందుకు వస్తున్నాయన్నారు.
ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలి అనే అవగాహన గ్రామస్థాయి కి తీసుకువెళ్లాలి. అందుకు అందరి సేవలు ఉపయోగించుకుంటామని చెప్పారు. ఓపీ గతం కంటే రెట్టింపు అయ్యింది…. ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల మీద నమ్మకం పెరిగింది అందుకే ఒక్కో బెడ్ మీద ఇద్దరు రోగులు పెట్టాల్సి వచ్చింది. ఇది భవిష్యత్తులో లేకుండా బెడ్ సంఖ్యను పెంచుతున్నామన్నారు.
60% డెలివరీలు ప్రభుత్వ ఆసుపత్రి లో జరుగుతున్నాయి అంటే అది కెసిఆర్ కిట్ సాధించిన విజయం.జీవన విధానంలో మార్పు వచ్చింది. సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చి మనిషిని రోగులను చేస్తుందన్నారు. గతంలో స్కూల్ కి నడిచి పోయేది, ఆటలు ఆడేవారు కానీ అవన్నీ ఇపుడు లేక జబ్బులు త్వరగా వస్తున్నాయి. మనిషి తన పని తను చేసుకోకుండా వేరే వారి మీద ఆధారపడుతున్నారు.తాగుడు పెరిగింది, గుట్కాలు పెరిగి అనారోగ్యం పెంచిదన్నారు. ఓల్డెన్ డేస్ రావాలి.. వెస్ట్రన్ కల్చర్ మోజులో పడవద్దన్నారు.