టీటీడీ బ్రహ్మోత్సవాలకు రండి..కేసీఆర్‌కు జగన్ ఆహ్వానం

428
jagan

ఈనెల 28 నుంచి తిరుమలలో జరగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు కుటుంబ సమేతంగా రావాల్సిందిగా సీఎం కేసీఆర్‌ని ఆహ్వానించారు ఏపీ సీఎం జగన్‌. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో భేటీ అయిన జగన్‌…బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి,ఎంపీలు ప్రభాకర్ రెడ్డి,మిథున్ రెడ్డి,రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ఉన్నారు.

ప్రగతిభవన్‌లో జరిగిన ఈ సమావేశంలో గోదావరి జలాల తరలింపు, విభజన అంశాలు, ఆర్థిక మాంద్యంతో పాటు తాజా రాజకీయాలపై సమాలోచనలు జరపనున్నారు. ఇరు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్‌, జగన్‌.. ఇప్పటికే పలుమార్లు సమావేశమై పలు అంశాలపై చర్చించారు.గోదావరి జలాలను శ్రీశైలం ప్రాజెక్టుకు తరలించే ప్రతిపాదనలపై ఈ భేటీలో ఇద్దరు సీఎంలు చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం.