ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ దేశంలో టాప్ పొజిషన్‌లో ఉందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రెండు రోజులపాటు జరుగుతున్న ఈ సదస్సులో భారత్ సహా 30 దేశాలు పాల్గొన్నాయి. శాస్త్రవేత్తలు, రైస్ మిల్లర్ల సంఘాల ప్రతినిధులతోపాటు 250 మందికిపైగా ప్రతినిధులు పాల్గొన్నారు.
భారత్‌లో వరిసాగు, ఉత్పత్తి, నాణ్యత, విదేశీ ఎగుమతుల పెంపుపై చర్చించనున్నారు. టెక్నాలజీ, మార్కెటింగ్, ఆహార భద్రత లక్ష్యాలుగా మేధోమథనం జరుగనుంది.
తెలంగాణలో క్రమంగా ధాన్యం ఉత్పత్తి పెరుగుతున్నదని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 1.2 కోట్ల ఎకరాల్లో ధాన్యం ఉత్పత్తి జరుగుతున్నదని పేర్కొన్నారు.
తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రమని…. ఇటీవలే దశాబ్ది ఉత్సవాలు జరుపుకున్నామని చెప్పారు. రాష్ట్రంలో రైస్ సమ్మిట్ నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు. ధాన్యం ఉత్పత్తిలో రాష్ట్రం అగ్రగామిగా ఉందని వెల్లడించారు.
Also Read:భజే వాయు వేగం..మా నమ్మకాన్ని నిలబెట్టింది