వ్యవసాయ రాష్ట్రంగా తెలంగాణ: సీఎం కేసీఆర్

371
ts cm
- Advertisement -

వ్యవసాయ రాష్ట్రంగా తెలంగాణ అవతరించడానికి పుష్కలమైన అవకాశాలున్నాయని తెలిపారు సీఎం కేసీఆర్. కేబినెట్ సమావేశం అనంతరం ప్రగతి భవన్‌లో మీడియాతో మాట్లాడిన సీఎం.. నల్ల రేగడి,ఎర్ర నేలలు,తేలికపాటి, చౌడు,ఇసుక నెలలు ఉన్నాయని చెప్పారు.

అన్నిరకాల పంటలు పండటానికి తెలంగాణ అనుకూలమన్నారు సీఎం. సగటు వర్షాపాతం నమోదవుతుందని అందుకే పంటల ఉత్పత్తిలో రికార్డులు సృష్టిస్తుందన్నారు సీఎం. ప్రభుత్వం చెప్పింది కాకుండా వేరే పంట వేస్తే రైతు బంధు రాదన్నారు సీఎం.

ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్ని పూర్తిదశకు చేరుకున్నాయని తెలిపారు సీఎం కేసీఆర్. ఈదురు గాలులు,వరదలు వంటి ప్రకృతి వైపరిత్యాలు తెలంగాణకు తక్కవు అన్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో అమలుచేయని విధంగా రైతుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు తీసుకొచ్చామన్నారు. రైతు బంధు పథకం దేశానికే ఆదర్శమన్నారు.

రైతు భీమా సదుపాయం గుంట భూమి ఉన్న రైతులకు వర్తింప చేస్తున్నామని చెప్పారు. మైక్రో ఇరిగేషన్ పై వంద శాతం సబ్సిడీ ఇస్తున్నామని చెప్పారు. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా వేలాది ట్రాక్టర్లు, హార్వెస్టర్లు పంచిపెట్టామన్నారు. వేలాది పాడిపశువులు పంపిణీ చేసి పాడి రైతులను ఆదుకుంటున్నామని చెప్పారు.

5 వేల ఎకరాలకు ఒక క్లస్టర్ చొప్పున 2604 క్లస్టర్‌లను ఏర్పాటుచేశామని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఏఈవోలను నియమించామన్నారు సీఎం. కల్తీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్టు నమోదుచేస్తున్నామన్నారు. రైతు వేదికల నిర్మాణం కోసం రూ. 350 కోట్లు కేటాయించామన్నారు.

నియంత్రిత పద్దతిలో వ్యవసాయం చేయాలని రైతులకు సూచించామన్నారు సీఎం. అందరూ ఒకే రకం పంటవేసి నష్టపోవద్దన్నారు. ప్రభుత్వం నిబంధనలను రైతులు తప్పకుండా పాటించాలన్నారు. ఒక కోటి 23 లక్షల ఎకరాల్లో పంటలు పండించారని ఈ సంవత్సరం మరో పది లక్షల ఎకరాలు పెరిగే అవకాశం ఉందన్నారు.

ఈ సారి 70 లక్షల ఎకరాల్లో పత్తిపంటను పండించాలన్నారు. తెలంగాణ పత్తి రకానికి డిమాండ్ ఉందన్నారు. గ్రౌండ్ వాటర్ పెరిగింది కాబట్టి పత్తిపంట వేయాలన్నారు. పత్తిపంట వేస్తే ఖర్చులు పోను ఎకరానికి రూ. 50 వేలు మిగులుతాయన్నారు. రైతులు ధనవంతులు కావాలన్నదే ప్రభుత్వ అభిమతమన్నారు. 40 లక్షల ఎకరాల్లో వరిపంట వేయాలన్నారు.

వర్షాకాలంలో మక్క పంట వేయవద్దని కంది పంట వేయాలన్నారు. యాసంగిలో మక్క పంట పండించుకోవచ్చన్నారు. ఈసారి కంది పంటను 15 లక్షల ఎకరాల్లో పండిద్దామని తెలిపిన సీఎం…ప్రభుత్వమే మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తుందన్నారు.

- Advertisement -