ఉద్యోగులకు పూర్తి వేతనాలు..ఉత్తర్వులు జారీ

185
ts
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు,పెన్షనర్లకు శుభవార్త తెలిపిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ఆదాయ పరిస్థితి కొంచెం కొంచెం మెరుగవుతున్నందున ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఈ నెల పూర్తి వేతనం చెల్లించాలని సీఎం కేసీఆర్ ప్రకటించగా ఈ మేరకు ఉత్తర్వలు జారీ చేసింది ప్రభుత్వం.

జూన్‌ నుంచి వేతనాలు చెల్లించాలని ఆర్థికశాఖ ఉత్తర్వులు వెలువరించింది. మార్చి, ఏప్రిల్‌, మే నెలకు సంబంధించిన బకాయిలకు విడిగా మార్గదర్శకాలు జారీ చేస్తామని పేర్కొంది.

కరోనా కారణంగా ఉద్యోగులు, పింఛనుదారుల వేతనాల్లో కోత విధించింది. మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో కోత విధించగా ఇప్పుడిప్పుడే రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి మెరుగవడంతో పూర్తిస్ధాయి వేతనాలను ఈ నెల 30న చెల్లించనుంది సర్కార్.

- Advertisement -