నితిన్ సినిమా రిజెక్ట్ చేసిన ఇలియానా

289
iliyana
- Advertisement -

యంగ్ హీరో నితిన్ ఇటివలే భీష్మ భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈచిత్రంలో నితిన్, రష్మిక మందన జంటగా నటించారు. ఈమూవీ నితిన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈమూవీతో తర్వాత మరో రెండు సినిమాల్లో నటిస్తున్నాడు నితిన్. ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే తో పాటు మరో సినిమాలో నటిస్తున్నాడు. దీంతో పాటు హిందీలో సూపర్ హిట్ అయిన అంధాధూన్ సినిమాని తెలుగులో నితిన్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. ఈమూవీలో హిరోతో పాటు టబు పాత్ర కూడా కీలకంగా ఉంటుంది. తెలుగులో టబు పాత్రలో నటించడానికి ముందుగా ఇలియానాను సంప్రదించారు చిత్రయూనిట్.

ఇలియాన ఈ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించిందట. దీంతో మరో సినీయర్ హీరోయిన్ ను వెతికేపనిలో ఉన్నారు చిత్రయూనిట్. రమ్యకృష్ణను సంప్రదించగా ఆమె భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ అడిగిందని సమాచారం. దీంతో చివరగా శిల్పాశెట్టిని ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది. ఇలియానా ఈ ఆఫర్ తిరస్కరించాడనికి ముఖ్య కారణం నితిన్ తో కలిసి గతంలో హీరోయిన్ గా చేసింది. అందుకే మళ్ళీ ఇప్పుడు నితిన్ తో నెగటివ్ క్యారెక్టర్ చేస్తే ఆమె కెరీర్ గ్రాఫ్ పూర్తిగా డౌన్ అయిపోతుందని భావించిఉండవచ్చని అంటున్నారు. ఇలియానాకు తెలుగులో ప్రస్తుతం పెద్దగా సినిమాలు ఏమి లేవు. తాజాగా వస్తోన్న సమాచారం మేరకు నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వస్తోన్న ఓ థ్రిల్లర్ మూవీలో ఇలియానాకు అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది.

- Advertisement -