అంగరంగ వైభవంగా తిరంగా పండగ : కేకే

58
keshavarao
- Advertisement -

రాష్ట్ర వ్యాప్తంగా తిరంగా పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించాలని ఉత్సవాల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సూచించారు కమిటీ చైర్మన్‌ కే. కేశవరావు. నిన్న సీఎం కేసీఆర్‌ సమక్షంలో జరిగిన సమీక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకునుగుణంగా అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేయాలని సూచించిన నేపథ్యంలో కమిటీ చైర్మన్‌ విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ నెల 8 నుంచి 22 వరకు జాతీయ తిరంగా వేడుకల షేడ్యూల్‌ను విడుదల చేశారు.

ప్రతి రోజు థియెటర్లలో మహాత్మగాంధీ చిత్ర ప్రదర్శన జరపాలని…. పాఠశాల పిల్లలకు ఉచితంగా ప్రదర్శించాలన్నారు. 15 రోజుల పాటు రాష్ట్రమంతటా చారిత్రక ప్రదేశాలను విద్యుద్ధిపాలతో అలంకరించాలని ఆదేశించారు. అన్ని రకాల ప్రభుత్వ లెటర్‌ హెడ్స్‌పై తిరంగా, జాతీయ లోగు ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సందర్భంగా రవీంద్రభారతీలో 15 రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. స్వాత్రంత్య పోరాటంలో పాల్గొన్న నాయకుల ఫోటోలతో అన్ని జిల్లాల వ్యాప్తంగా ఫోటో ప్రదర్శన చేపట్టాలన్నారు. ప్రముఖ బాలివుడ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎఅర్ రహమాన్‌, సింగర్‌ ఏసుదాసుతో మ్యూజికల్‌ నైట్‌ నిర్వహించాలని తెలిపారు. ప్రతి గడప గడపకు ఒక కోటి ఇరవై లక్షల జాతీయ జెండాలను పంపిణీ చేయాలన్నారు. జిల్లాలోని అన్ని రకాల ప్రముఖులకు, ఉత్తములకు, సంఘ సంస్కర్తలకు సన్మాన కార్యక్రమం నిర్వహించాలన్నారు. వరంగల్‌ జైలును ఓపెన్‌ జైలుగా చేయాలని ప్రతిపాధించారు. స్వాతంత్య్ర యోధులకు సత్కారం చేసి గౌరవించాలన్నారు. 75 మంది కళాకారులతో ….75 ముఖ్యమైన చారిత్రక సంఘటనలపై చిత్ర ప్రదర్శనలు నిర్వహించాలని సూచించారు. ఈ నెల 21న ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి…. దేశాభివృద్ధిపై ప్రత్యేక తీర్మానం చేయాలని తీర్మనించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరూ ఏక కాలంలో జాతీయ గీతాలపన చేయాలని నిర్ధేశించారు. ప్రతి ఇంటా తిరంగా జాతీయ వేడుకలను నిర్వహించుకోవాలని….అందుకు కావల్సిన వాటిని ప్రభుత్వమే సమకూరుస్తుందని ప్రకటించారు. తెలంగాణ సంస్కృతి సంప్రాదాయాలకు అనుగుణంగా జానపద పండుగలను నిర్వహించుకోవాలన్నరు. ఈ నెల 22న హైదరాబాద్‌లో ఎల్బీ స్టేడియంలో ముగింపు వేడుకలను నిర్వహిస్తామని తెలిపారు. ఎల్బీ స్టేడియంలో బుక్‌ఫెయిర్‌ కూడా ప్రత్యేక ఆకర్షణగా ఉండాలని సూచించారు.

- Advertisement -