డేగ కన్ను ప్రారంభం రేపే…

80
ccc
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆగస్టు 04వ తేదీ గురువారం మధ్యాహ్నం 1 గంటకు సీఎం కేసీఆర్ దీనిని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా… కమాండ్ కంట్రోల్ రూమ్ ప్రారంభోత్సవ ఏర్పాట్లను సీపీ సివి ఆనంద్ పరిశీలించారు. వందల మంది కార్మికులతో ఎంట్రెన్స్ దగ్గర ఉన్న రోడ్డు మీద చెట్లు తొలగించి కాంపౌండ్ వాల్ చుట్టూ వెదురు చెట్లు నాటుతున్నారు. మెయిన్ ఎంట్రెన్స్ దగ్గర డివైడర్లు, గేట్ దగ్గర పెండింగ్ పనులను పూర్తి చేస్తున్నారు. అన్ని పనులు సాయంత్రం కల్లా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నారు.

పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు నూతన సాంకేతిక పరిజ్ఞానం వాడలన్న ఉద్ధేశ్యంతో సీసీసీ బీల్డింగ్‌ రూపకల్పన చేయబడింది. ఇది ఫ్రేండ్లీ పోలీసింగ్‌, గ్రీన్‌ బీల్డీంగ్‌, పర్యావరణ హితంగా ఈ భవనాన్ని నిర్మించారు. ఈ భవన ముఖ్య ఉద్ధేశ్యం అన్ని డిపార్ట్‌మెంట్స్‌ ఓకే చోట ఉండాలని, రాష్ట్రంలోని పోలీసులకు డేగ కన్ను మాదిరిగా ఉండాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ సీసీసీ రూపకల్పన చేశారు. అన్ని శాఖలను సమన్వయం చేస్తూ అంతర్జాతీయ ప్రమాణాలతో సీసీసీ నిర్మాణం చేపట్టారు. కమాండ్ కంట్రోల్ లో మొత్తం ఐదు టవర్లున్నాయి. టవర్ ఏలో ఇరవై అంతస్తులు ఉండగా.. ఇందులోనే సిటీ పోలీస్ కమిషనర్ కార్యాలయం ఏర్పాటు చేశారు. టవర్ ఏ పై భాగంలో హెలిప్యాడ్ నిర్మాణం … 15 మంది కూర్చునే సామర్థ్యం ఉన్న హెలికాప్టర్‌ ల్యాండ్ అయ్యే విధంగా డిజైన్‌ చేశారు. టవర్‌ ఏ 84.2మీ ఎత్తుతో ఉండి జాతీయ ఏవియేషన్‌ పరిమితులకు లోబడి నిర్మించారు. టవర్ బీ,సీ,డీలు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 65.2 మీటర్ల ఎత్తులో నిర్మాణం చేపట్టారు. టవర్ బీ లో 15 అంతస్తుల్లో టెక్నాలజీ ఫ్యూజన్ సెంటర్ ఉండనుంది. ఇందులోనే షీ సేఫ్టీ, సైబర్‌, నార్కోటిక్స్‌, క్రైమ్స్‌, ఇంక్యూబేషన్‌ సెంటర్‌లను ఉండనున్నాయి. ఇక టవర్ సీ విషయానికి వస్తే.. ఇందులో మూడు ఫ్లోర్లున్నాయి. దీని ఆడిటోరియం గా పోలీసులు వినియోగించనున్నారు. టవర్ డీని మీడియా అండ్ ట్రైనింగ్ సెంటర్ గా ఉపయోగించనున్నారు. మొత్తం ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణంలో టవర్ ఏ మరియు ఈ కీలకం. టవర్ ఈలో కమాండ్ కంట్రోల్ అండ్ డేటా సెంటర్, సీసీ టీవీ మానిటరింగ్ మరియు వార్ రూమ్ ఉండనున్నాయి. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి హైదరాబాద్ నగరాన్ని 360 డిగ్రీల కోణంలో చూసే సౌకర్యం ఉంది. కమండ్ కంట్రోల్ లో ప్రత్యేక మ్యూజియం.. పోలీస్ డిపార్ట్‌మెంట్ ఎలా ఫంక్షన్ అవుతుందో తెలుసుకునే అవకాశం ఉంది.

- Advertisement -