తెలంగాణలో మరింత తగ్గిన ఉష్ణోగ్రతలు..

211
temparature
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడురోజుల వరకు వెదర్ రిపోర్టును తెలిపింది హైదరాబాద్ వాతావరణ శాఖ. రాష్ట్రంలో ప్రధానంగా ఈశాన్య/తూర్పు దిశ నుండి గాలులు వీస్తున్నాయి.రాగల మూడు రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

ఈరోజు తెలంగాణలో అనేక ప్రదేశాలలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణ ఉష్ణోగ్రత కంటే 3 నుండి 5 డిగ్రీలు తక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉంది. హెచ్చరిక: ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, కోమరంభీం, కామారెడ్డి, మెదక్,రంగరెడ్డి, నిర్మల్, నిజామాబాద్,సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి మరియు హైదరాబాద్ జిల్లాలలో ఒకటి రెండు చోట్ల చలి గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.

- Advertisement -