వణికిస్తున్న చలి….

144
weather
- Advertisement -

తెలంగాణను చలి వణికిస్తోంది. ఉత్తర భారతం నుంచి వీస్తున్న శీతల గాలుల కారణంగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు బాగా పడిపోతున్నాయి. నాలుగైదు రోజులుగా చలితీవ్రత పెరగడంతో జనం అల్లాడిపోతున్నారు. రాత్రి వేళ్లలో కనిష్ట ఉష్ణోగ్రత ఏకంగా 10 డిగ్రీలకు పడిపోవడంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికే వణికిపోతున్నారు.

ఆసిఫాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రత 7.1 డిగ్రీలకు పడిపోయింది. ఈ సీజన్‌లో ఇది అతి తక్కువ ఉష్ణోగ్రత అని అధికారులు వెల్లడించారు. ఇదే సమయంలో సంగారెడ్డి జిల్లాల్లోని 9 మండలాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రత 10 డిగ్రీల కన్నా తక్కువకు చేరిందని తెలిపారు.

సాధారణ ఉష్ణోగ్రతలతో పోలిస్తే, నమోదవుతున్న ఉష్ణోగ్రతలలో చాలా వ్యత్యాసం కనిపిస్తున్నదని అధికారులు అంటున్నారు. కనిష్ఠ ఉష్ణోగ్రత సగటు కన్నా 2.6 డిగ్రీలు తక్కువగా, గరిష్ఠ ఉష్ణోగ్రత కన్నా 3.9 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయని తెలిపారు.

- Advertisement -