సీఎం కేసీఆర్‌కు ఉపాధ్యాయుల విజ్ఞప్తి..

96
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన 317 జీవోను అనుసరించి చేపడుతున్న ఉపాధ్యాయ బదిలీలు, స్పౌజ్ కేసుల సమస్యను పరిష్కరించాలని ఉపాధ్యాయులు సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఉపాధ్యాయులు జైపాల్ రెడ్డి, సుమ, శ్రీదేవి సుమన్ మాట్లాడుతూ బదిలీల కారణంగా భార్య భర్తలు వేరువేరు జిల్లాలలో పని చేయాల్సిన దుస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

కుటుంబాలు విచ్చిన్నం అయ్యే ప్రమాదం నెలకొంటుందని అన్నారు. ఈ సమస్యకు పరిష్కారం చూపుతూ తూ.గో 19 జిల్లాలలో భార్యాభర్తల కేసులను ప్రత్యేక కేసుగా పరిగణించి పరిష్కరించారని, పెండింగ్‌లో ఉన్న మరో 13 జిల్లాల సమస్యను సైతం పూర్తిస్థాయిలో పరిష్కరించాలని వేడుకుంటున్నారు. తాము ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో ను వ్యతిరేకించడం లేదని, అందులోని లోపాలను సరిచేసి న్యాయం చేయాలని కోరారు.

- Advertisement -