పార్టీ కార్యకర్తలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపు..

85
- Advertisement -

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై పోరాడాలని ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదుపై బూత్ ఎన్ రోలర్స్ తో ఎంపి ఉత్తమ్,మాజీ సిఎల్‌పి లీడర్ జానారెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. సామాజిక న్యాయమే కాంగ్రెస్ ధ్యేయంగా కాంగ్రెస్ పని చేస్తోందని ఆయన అన్నారు.

ఏ ఒక్క వాగ్దానం అమలు చేయకుండా,తాత్కాలిక ప్రయోజనాలు ఆశించి, వాగ్దానాలతో గద్దెనెక్కిన మతోన్మాద బిజెపి,అవినీతి టిఆర్ఎస్ ప్రభుత్వాలపై పోరాడాలని ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో మిర్యాలగూడ అసెంబ్లీ స్థానాన్ని 50 వేల మెజార్టీతో కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అన్నారు.

కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ నాయకులను, కార్యకర్తలను కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శంకర్ నాయక్, మిర్యాలగూడ నియోజకవర్గ ఇంచార్జ్ బత్తుల లక్ష్మారెడ్డి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -