మళ్లీ బీఆర్ఎస్‌దే అధికారం..

46
- Advertisement -

తెలంగాణలో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని మిషన్ చాణక్య సర్వే రిపోర్టు వెల్లడించింది. 14లక్షల డేటా సేట్ తో పనిచేశాం అని..44.62 ఓటింగ్ శాతంతో బీఆర్ఎస్‌ హ్యాట్రిక్ కొడుతుందని వెల్లడించారు. ఇక కాంగ్రెస్‌కు 32.71 శాతం ఓట్లు వస్తాయని బీజేపీకి 17.6 శాతం ఓటింగ్ వస్తుందని వెల్లడించింది.

గత నాలుగు నెలలుగా  విస్తృతంగా అధ్యయని చేసి డేటా సేకరించామని..ప్రభుత్వ సంకేమ కార్యక్రమాలు, అభివృద్ధిపై 85 శాతం మంది సంతృప్తిగా ఉన్నారని వెల్లడించింది.

కర్ణాటక ఎన్నికల తరవాత కాంగ్రెస్ కి BRS మానిఫెస్టో తరవాత ఫిమేల్ ఓట్ షేర్ పెరిగిందని తెలిపింది. మిగితా పార్టీలకు ఓటు షేర్ తగ్గిందని.. 65+ ఏజ్ గ్రూప్ లో BRS ఓటు షేర్ ఎక్కువ ఉందని వెల్లడించింది. మైనార్టీ సెంగ్మెట్ లో బీఆర్ఎస్‌కి 48.31 శాతం ఓట్లు, కాంగ్రెస్ 32 శాతం ఓట్లు వస్తాయని వెల్లడించింది.

ఇక ఏజెన్సీ సి.ఎన్‌.ఎక్స్‌ తో కలిసి ఇండియా టివి నిర్వహించిన ఒపీనియన్ పోల్‌లో సైతం బీఆర్ఎస్‌దే అధికారం అని వెల్లడించింది. బీఆర్‌ఎస్‌కు 70 సీట్లు, కాంగ్రెస్ 34, బీజేపీ 7 సీట్లు,మజ్లిస్ 7 గెలుచుకునే అవకాశం ఉందని తెలిపింది.

Also Read:BJP:రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేత

- Advertisement -