- Advertisement -
తెలంగాణలో మరి కొద్దిసేపట్లో పదో తరగతి ఫలితాలు విడుదల కానున్నాయి. ఉదయం 11.30గంటలకు సచివాలయంలోని డి-బ్లాక్ లో విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫలితాల విడుదల అనంతరం వాటిని ప్రభుత్వ వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేస్తారు. పాఠశాలల వారీగా ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయిలు లాగిన్ వివరాలను సమర్పించి ఫలితాలను చూసుకోవచ్చు. . ఈ మేరకు విద్యార్థుల సౌకర్యం కోసం విద్యాశాఖ TSSSCBOARD యాప్ ను అభివృద్ధి చేసింది. విద్యార్థులు, టీచర్లు ఆండ్రాయిడ్ ఫోన్లలోని ప్లేస్టోర్ నుంచి ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అనంతరం రూల్‌నంబర్, పుట్టిన తేదీ టైప్‌చేసి లాగిన్ కావచ్చునని విద్యాశాఖ పేర్కొన్నది. ఫలితాల కోసం
www.bse.telangana.gov.in,
http;//results.cgg.gov.in,
www.ntnews.com
- Advertisement -