మే 13న పదో తరగతి పరీక్షా ఫలితాలు…

450
10th class results
- Advertisement -

తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాలు ఎప్పుడా అనే ఉత్కంఠకు తెరపడింది. ఈ నెల 13న ఉదయం 11.30 గంటలకు పరీక్ష పలితాలను విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. తెలంగాణ సచివాలయంలోని డీ బ్లాక్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఫలితాలను అధికారులు విడుదల చేయనున్నారు. ఫలితాలను వెబ్ సైట్ల ద్వారా చూసుకోవచ్చని వెల్లడించారు.www.bse.telangana.gov.in లేదా results.cgg.gov.in ద్వారా తెలుసుకోవచ్చారు.

ఇంటర్ ఫలితాల్లో కొందరి నిర్లక్ష్యం వల్ల తప్పులు దొర్లిన నేపథ్యంలో.. పదోతరగతి ఫలితాలపై పాఠశాల విద్యాశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఒకటికి రెండుసార్లు పరిశీలించిన తర్వాతే ఫలితాలను వెల్లడించేలా ప్రణాళికను సిద్ధం చేశారు. పాఠశాల హెడ్‌మాస్టర్లకు పరీక్ష ఫలితాలను పంపనున్నారు. ఫలితాల వెల్లడి రోజున ప్రిన్సిపల్స్, టీచింగ్ స్టాఫ్ అందరూ వారివారి పాఠశాలలకు హాజరుకావాల్సి ఉంటుంది.

ఫలితాల వెల్లడిలో ఆలస్యమైనా కచ్చితత్వంతో ఫలితాలు ఇస్తామని పాఠశాల విద్యాశాఖ అధికారులు అంటున్నారు. ఇందులో భాగంగా ముందు జాగ్రత్తగా కొన్ని జవాబు పత్రాలు రీ వెరిఫికేషన్ కూడా చేస్తున్నారు. విద్యార్థులకు ఏవైనా సందేహాలుంటే తమ దృష్టికి తీసుకురావాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. విద్యార్థులు నేరుగా ఫిర్యాదు చేసేలా ఆన్‌లైన్‌లో ఏర్పాట్లు కూడా చేశారు. ఫలితాల్లో ఎవైనా తప్పులు దొర్లితే విద్యార్థులు,వారి తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని కోరారు అధికారులు.

may 13th

- Advertisement -