నేడు స్టాలిన్ తో భేటీ కానున్న సీఎం కేసీఆర్..

223
Kcr Stalin
- Advertisement -

డిఎంకే అధినేత స్టాలిన్ తో నేడు భేటీ కానున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. నిన్న సాయంత్రం ప్రత్యేక విమానంలో చైన్నై బయలు దేరారు సీఎం. ఆయనతో పాటు సీఎం కేసీఆర్ కుటుంబసభ్యులు, ఎంపీ వినోద్ కుమార్, కేశవరావు, సంతోష్‌కుమార్‌ లు వెళ్లారు. ఇవాళ ఉదయం సీఎం శ్రీరంగం, తిరుచ్చిలోని ఆలయాలను సందర్శిస్తారు. సాయంత్రం 4.30కి డీఎంకే పార్టీ అధ్యక్షుడు స్టాలిన్‌తో సమావేశమవుతారు. ఆ తర్వాత ఆయన హైదరాబాద్‌కు రానున్నారు.

ఫెడరల్ ఫ్రంట్, రాజకీయ పరిణామాలు, ప్రాంతీయ పార్టీల సన్నద్ధత తదితర అంశాలపై కేసీఆర్.. స్టాలిన్‌తో చర్చించనున్నట్లు సమాచారం. లోక్ సభ ఎన్నికల ఫలితాలకు మరో పది రోజులు మాత్రమే ఉండటంతో సీఎం కేసీఆర్ పర్యటనలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. దేశంలో బీజేపీ, కాంగ్రెస్ కూటములను వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కొంత మంది నేతలు కేసీఆర్ ఫ్రంట్ కు మద్దతిచ్చారు. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ కాంగ్రెస్‌తో సానుకూలంగా వ్యవహరిస్తున్నా… కేసీఆర్‌ లేవనెత్తిన అంశాలకు మద్దతునిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత పరిస్ధితులు ఏవిధంగా మారనున్నాయో అని ఆసక్తినెలకొంది.

- Advertisement -