- Advertisement -
పెరిగిన గ్యాస్ ధరలకు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమానికి పిలుపినిచ్చాడు ఈ మేరకు టీఆర్ఎస్ నాయకులు అందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వలన సామాన్య జనం కష్టాల పాలవుతున్నారన్నారు. రాష్ట్రంలోని అన్ని గ్రామీణ, పట్టణ కేంద్రాల్లో మోదీ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దేశాన్నికి పట్టిన ఒక భూతంలా ప్రజలందరూ మోదీని కొనియాడారు.
కామారెడ్డి జిల్లాలో రొడ్లపైన వంటవార్పు కార్యక్రమం చేశారు. కట్టెల పొయ్యి పైన వంటలు వండి చేసి నిరసనలు తెలపారు.
హైదరాబాద్ జిల్లా టీఆర్‌ఎస్ కార్యకర్తలు రోడ్లపైకి గ్యాస్ సిలిండర్‌లు తెచ్చి, కట్టెల మోపులను నెత్తిన పెట్టుకొని వినూత్న నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో దానం నాగేందర్, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
పెద్దపల్లి జిల్లాలో మంత్రి కొప్పుల ఈశ్వర్ గారి నాయకత్వంలో పెంచిన గ్యాస్ బండలతో రొడ్ల పైకి వచ్చి దర్నా చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ శ్రేణులు పెద్ధ ఏత్తున్న నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
జగిత్యాల జిల్లాలో కేటీఆర్ పిలుపుమేరకు రొడ్ల పైకి వచ్చి కట్టెలపొయ్యి పైన వంటవార్పు చేశారు. జిల్లావ్యాప్తంగా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
సంగారెడ్డి జిల్లాలో పెరిగిన గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేశారు. కేటీఆర్ పిలుపు మేరకు కేంద్రం తీసుకొనే విధాన పరమైన నిర్ణయాల వలన సామాన్య జనజీవితం ఆస్తవ్యస్తమవుతొందన్నారు.
జనగామ జిల్లాలో పెద్ద ఎత్తున్న టీఆర్‌ఎస్ కార్యకర్తలు కేటీఆర్ పిలుపు మేరకు గ్యాస్ ధరలపెంపుపై నిరసనలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
సిద్దిపేట జిల్లావ్యాప్తంగా ప్రజలు పెరిగిన గ్యాస్ ధరలపై నిరసనలు తెలియజేశారు. కేటీఆర్ పిలుపు మేరకు మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేసి గ్యాస్ బండలు రొడ్ల పైకి తెచ్చి నిరసనలు తెలిపారు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో పెద్ద ఎత్తున్న టీఆర్‌ఎస్ మహిళా కార్యకర్తలు రొడ్ల పైకి గ్యాస్ సిలెండర్‌లను తెచ్చి నిరసన తెలిపారు.
కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ నాయకులు గ్యాస్ ధరలపెంపు పై నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు, సుడా చైర్మన్ జి వి రామకృష్ణారావు గారు, మాజీ ఎమ్మెల్సీ, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారదాసు లక్ష్మణ్ రావు గారు, నగర మేయర్ యాదగిరి సునీల్ రావు గారు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూప - హారిశంకర్ గారు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -