రాష్ట్ర సాంకేతిక విద్య మరియు శిక్షణ బోర్డు … బిట్స్ పిలానీతో ఎంవోయూ

55
bits
- Advertisement -

తెలంగాణలోని పాలిటెక్నిక్‌లు మరియు ఇంజనీరింగ్ సంస్థల కోసం టెక్నాలజీ ఎనేబుల్డ్ లాబొరేటరీస్ (టెల్‌), రాష్ట్ర సాంకేతిక విద్య మరియు శిక్షణ బోర్డు (ఎస్బీటెట్‌) బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ (బిట్స్)తో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి.

టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ మాట్లాడుతూ….సాంకేతిక విద్య యొక్క దృక్కోణంలో, మా విద్యార్థులలో సరైన నైపుణ్యాల అభివృద్ధికి వారు అందించే అనుభవపూర్వక అభ్యాసన అవకాశాలను ఖచ్చితంగా ఉపయోగించుకొవాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులకు సమగ్రమైన అనుభవపూర్వక అభ్యాసాన్ని అందించడానికి, తెలంగాణలో బీట్స్ ఫిలానీ విల్ప్‌ సుమారు 10 రిమోట్ ల్యాబ్‌లు, మరియు 26 వర్చువల్ ల్యాబ్‌లను ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. రాష్ట్రంలోని వేలాది మంది విద్యార్థుల అభ్యసన అవసరాలకనుగుణంగా ఈ ల్యాబ్‌లు తీర్చగలవన్నారు.

బిట్స్ పిలానీకి చెందిన ఆఫ్-క్యాంపస్ ప్రోగ్రామ్‌లు & ఇండస్ట్రీ ఎంగేజ్‌మెంట్ డైరెక్టర్ ప్రొఫెసర్ G.సుందర్ మాట్లాడుతూ… గత కొన్ని సంవత్సరాలుగా, మేము బిట్స్ పిలానీలో ప్రత్యేకంగా వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ కోసం అనేక రిమోట్ మరియు వర్చువల్ ల్యాబ్‌లను రూపొందించాము. అభివృద్ధి చేసాము మరియు అమలు చేసాము. భారతదేశం మరియు ప్రపంచవ్యాప్తంగా పని చేసే నిపుణుల కోసం ఈ ప్రోగ్రామ్‌లు తయారు చేసామని తెలిపారు.

- Advertisement -