నాలుగు గంటల పాటు భీకర పోరు.. చివరికి మట్టుబెట్టారు.

68
punjab
- Advertisement -

పంజాబ్ సింగర్‌ సిద్ధూ మూసేవాలా హత్యలో భాగంగా భక్నాలో నేడు కార్డన్‌ సెర్చ్‌ చేపట్టగా గ్యాంగ్‌స్టర్‌లు కాల్పులు జరిపారు. దీంతో ఎదురు కాల్పులు జరిపిన పోలీసులు ఇద్దర్నీ హతమర్చారు. నాలుగు గంటల పాటు జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌ ముగిసిందన్నారు. ఇద్దరు ముఠా నాయకులను మట్టుబెట్టినట్లు తెలిపారు. వారు జగ్‌ రూప్‌ సింగ్‌, మన్‌ ప్రీత్‌ సింగ్‌ గా గుర్తించామని పంజాబ్‌ పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి ఒక AK47, ఒక పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు పోలీసు అధికారులకు కూడా స్వల్ప గాయాలయ్యాయని పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ ప్రకటించారు.

సిద్ధూ మూసేవాలా హత్య కేసులో నిందితులను ట్రాక్ చేస్తున్నాము మరియు మా టాస్క్‌ఫోర్స్ ఈ ప్రాంతంలో కొంత కదలికలను గుర్తించింది. మేము వాటి కదలికలపై నిఘా పెట్టామన్నారు. మా ఫోరెన్సిక్ బృందం సంఘటనా స్థలంలో కీలకమైన సమాచారంను సేకరిస్తుందని తెలిపారు. సిద్దూ మే 29 తన స్వగ్రామంకు వెళ్తుండగా మార్గ మధ్యలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. విచారణానంతరం గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్ బిష్ణోయ్‌ హస్తం ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు. ఈ కేసులో ఇప్పటివరకు పలువురిని అరెస్టు చేశారు.

- Advertisement -