తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు. పదో తరగతి ఫలితాల్లో బాలికలే పై చేయి సాధించారని తెలిపారు. 5 లక్షల మందికి పైగా విద్యార్థులు పది పరీక్ష రాయగా91.31 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఫలితాలను bse.telangana.gov.inలో చెక్ చేసుకోవచ్చు.
బాలికల ఉత్తీర్ణత శాతం 93.23 గా ఉండగా బాలుర ఉత్తీర్ణత శాతం 89.42గా నమోదైంది. నిర్మల్ జిల్లా 99.09 శాతం ఉత్తీర్ణతతో అగ్రస్థానంలో నిలవగా వికారాబాద్‌లో అత్యల్పంగా ఉత్తీర్ణత శాతం 91.31 శాతంగా నమోదైంది.3వ స్థానంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఉంది.
తెలంగాణ గురుకులాల్లో 98.71 శాతం ఉత్తీర్ణత సాధించగా ఆరు ప్రైవేటు పాఠశాలల్లో సున్నా శాతం ఉత్తీర్ణత సాధించింది. జిల్లా పరిషత్ గవర్నమెంట్ పాఠశాలల్లో 91.31 శాతం ఉత్తీర్ణత సాధించారు. పదో తరగతి అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు మూడో తేదీ నుంచి జూన్ 13వ తేదీ వరకు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరుగనున్నాయని వెంకటేషం తెలిపారు.
Also Read:కరీంనగర్‌కు రేవంత్..