తెలంగాణలో పదో తరగతి పరిక్షల ఫలితాలు ఈ నెల 30 విడుదల కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఒ ప్రకటన చేసింది. ఇందుకు ఎస్‌ఎస్‌సీ బోర్డు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం ఉదయం 11:30 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి టెన్త్ ఫలితాలను విడుదల చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు మే 23 నుంచి జూన్ 1వ తేదీ వరకు కొనసాగిన విషయం తెలిసిందే.
కాగా, తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు ఈరోజు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో అమ్మాయిలు సత్తాచాటారు. కరోనా కారణంగా గడచిన రెండేళ్లుగా పరీక్షలు లేకుండానే విద్యార్థులను పాస్ చేస్తున్న వైనం తెలిసిందే. ఈ క్రమంలో రెండేళ్ల గ్యాప్ తర్వాత పదో తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఏ మేర ఉత్తీర్ణత సాధిస్తారన్న విషయంపై ఆసక్తి నెలకొంది.

