కుటుంబ సమేతంగా రామేశ్వరం దేవాలయంను సందర్శించిన సీఎం కేసీఆర్

324
cm kcr

ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా కేరళ టూర్ ముగించుకుని తమిళనాడులో పర్యటిస్తున్నారు సీఎం కేసీఆర్. నిన్న రామేశ్వరంలోని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సమాధి దగ్గరకు వెళ్లిన ఆయన నివాళులు అర్పించారు. ఇవాళ రామేశ్వరం దేవాలయంను కుటుంబ సమేతంగా సందర్శించారు. దనుష్కోటి, రామసేతు, పంచముఖి హనుమాన్ ల ను దర్శించుకున్నారు. ఈ పర్యటనలో సీఎంతో పాటు ఆయన సతీమణి శోభమ్మ, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆయన సతీమణి శైలిమా, తనయుడు హిమన్షు, రాజ్యసభ సభ్యలు జోగినపల్లి సంతోష్ కుమార్ లు ఉన్నారు.

cm kcr