తెలంగాణ యాసకు కేరాఫ్ ‘శకుంతల’

88
- Advertisement -

తెలంగాణ శకుంతల…పరిచయం అక్కర్లేని పేరు. తెలంగాణ, రాయలసీమ యాసతో ఆకట్టుకున్నారు. ప్రధానంగా విలన్ పాత్రలో ఆమె నటనకు ప్రశంసలు అందుకున్నారు. రంగస్థల నటిగా తన నటన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆమె…విలక్షణ పాత్రలతో మెప్పించారు. ఇవాళ ఆమె వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనం..

మహారాష్ట్రలో పుట్టి పెరిగిన శకుంతల పూర్తిపేరు పేరు కడియాల శకుంతల. 1979లో మా భూమి ద్వారా తెలుగు సినీ రంగంలోకి ప్రవేశించారు. తన కెరీర్‌లో దాదాపు 250కి పైగా చిత్రాలలో నటించారు. ఎన్నో సినిమాలో విలక్షణ పాత్రలతో మెప్పించిన ఆమె.. 2014 జూన్ 14న గుండెపోటుతో అకాల మరణం చెందారు. ఆమె జీవితంలో ఎన్నో విషాదాలు ఉన్నాయి.

Also Read:రాజన్న సిరిసిల్లకు మంత్రి కేటీఆర్…

కుటుంబం కోసం పడిన కష్టాలు,రెండుసార్లు భయంకరమైన యాక్సిడెంట్స్, ఎన్నో కష్టాలను ఎదురెళ్లి ఆత్మస్థైర్యంతో నిలబడ్డారు. చాలా చిత్రాల్లో తెలంగాణా యాస మాట్లాడటం వలన తెలంగాణ ఇంటి పేరుగా మారిపోయింది.

నువ్వు నేను సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఒక్కడు సినిమా ఆమె కెరీర్‌ను మరింత ముందుకు తీసుకెళ్లింది. కేవలం విలన్ గా మాత్రమే కాదు సీరియస్ లుక్కులోనూ కామెడీతో ఆడియన్స్ ను నవ్వించారు. లక్ష్మి సినిమాలో వేణుమాధవ్ తో కలిసి ఆమె చేసిన కామెడీ ఇప్పటికి అందరికి గుర్తుండే ఉంటుంది.

Also Read:హైదరాబాద్‌కు అమిత్ షా..షెడ్యూల్ ఇదే

- Advertisement -