మేయర్,ఛైర్మన్ల ఎన్నికకు సర్వం సిద్ధం:పార్ధసారథి

33
sec

గ్రేటర్ వ‌రంగ‌ల్, ఖ‌మ్మం మున్సిప‌ల్ కార్పొరేష‌న్ల‌ మేయ‌ర్లు, డిప్యూటీ మేయ‌ర్ల ఎన్నికలతోపాటు అచ్చంపేట‌, జ‌డ్చ‌ర్ల‌, కొత్తూరు, సిద్దిపేట‌,న‌కిరేక‌ల్ మున్సిపాలిటీల‌కు చైర్మ‌న్లు, వైస్ చైర్మ‌న్ల ఎన్నిక‌కు రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది.ఈ నెల 7న ఎన్నికకు జరగనుండగా కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా అన్నిఏర్పాట్లు చేశామన్నారు. మేయర్‌, చైర్‌పర్సన్ల ఎన్నికపై బుధవారం ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

కొవిడ్ నిబంధ‌న‌ల మేర‌కు ప్ర‌త్యేక స‌మావేశం నిర్వ‌హించాల‌ని… 7న మ‌ధ్యాహ్నం 3 గంట‌ల వ‌ర‌కు మేయ‌ర్లు, డిప్యూటీ మేయ‌ర్లు, చైర్మ‌న్లు, వైస్ చైర్మ‌న్ల ప్ర‌మాణ‌స్వీకారం ముగించాల‌ని తెలిపింది. ఎన్నికైన సభ్యులందరితో ఒకేసారి ప్రమాణ స్వీకారం చేయించాలని సూచించారు.