చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేస్తాం..

35
kotha

రైతు సంక్షేమమే పరమావధిగా సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని trs ప్రభుత్వం పనిచేస్తుందని మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు..అకాల వర్షం మూలంగా దుబ్బాక నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో వరి ధాన్యం తడిచిపోవడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు..రైతులు ఆందోళన చెందవద్దని, చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేస్తామని ఆయన తెలిపారు.

మెదక్ జిల్లాలో ధాన్యం కొనుగోలు వేగవంతంగా జరిగేలా మంత్రి తన్నీరు హరీష్ రావు అధికారులతో నిత్యం పర్యవేక్షిస్తున్నారని ఆయన తెలిపారు..దుబ్బాక నియోజకవర్గంలో ధాన్యం సేకరణ కోసం రైతులకు అందుబాటులో తొగుట మండలం లో 19, దుబ్బాకలో 39, దౌల్తాబాద్ లో 23, మిర్దోడ్డి లో 22, రాయపోల్ లో 17, చేగుంటలో 25 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

వర్షాలు కురుస్తున్నాయని. రైతులకు నష్టం వాటిల్లుతుందని, మిల్లర్లు పూర్తి స్థాయిలో సహకారం అందించాలన్నారు..కేంద్రాల వద్ద గన్ని బ్యాగుల కొరత లేకుండా చూడాలని, ప్రతి రోజు ధాన్యం కొనుగోలు జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు.రైతులు పొలం దగ్గర ధాన్యం ఎండబెట్టుకొని రావాలని, కొనుగోలు కేంద్రం వద్దకు రాగానే కొనుగోళ్లు జరుగుతాయని ఆయన తెలిపారు.