చంద్రయాన్ 3 విజయంలో తెలంగాణ సైంటిస్ట్

56
- Advertisement -

జాబిల్లిపై అడుగుపెట్టి అంతరిక్ష పరిశోధనలోఓ మైలురాయిని సాధించింది భారత్. ఈ విజయం వెనుక ఎంతోమంది సైంటిస్టుల కృషి ఉండగా అందులో మన రాష్ట్రానికి చెందిన వెంకట కార్తీక్ కూడా ఉన్నారు. రామగుండం ఎన్టీపీసీకి చెందిన వెంకట కార్తీక్..ఎన్టిపిసి లోని పూర్వ చిన్నమయ్య విద్యాలయంలో పదవ తరగతి వరకు చదివారు.

అక్కడి నుండి హైదరాబాద్ సిబిఐటిలో ఈసీఈ ఇంజనీర్ చదివి… బెంగళూరులో ఐఐ ఎస్ ఈ చేసి గేట్ ఆల్ ఇండియా లో 22వ ర్యాంకు సాధించారు. అనంతరం శ్రీహరికోట నాసాలో సైంటిస్ట్ గా చేరి అప్పటినుండి అనేక ప్రయోగాలు చేస్తూ నేటి చంద్రయాన్ 3 విజయంలో కూడా పనిచేశారు. చంద్రయాన్ 3 విజయంలో భాగస్వాములైన తన కొడుకు వెంకట్ కార్తీక్ పాల్గొనడం తనకు ఆనందయాయంగా ఉందని తండ్రి సత్యప్రసాద్ తల్లి రమాదేవిలు తెలిపారు.

Also Read:CM KCR:చరిత్ర సృష్టించిన భారత్

- Advertisement -