ఘనంగా తెలంగాణ సమైక్యత వజ్రోత్సవాలు

42
ts
- Advertisement -

నేటి నుండి మూడు రోజుల పాటు తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరగనున్నాయి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో శుక్రవారం దాదాపు 15 వేల మందితో ర్యాలీలు నిర్వహించి తెలంగాణ సమైక్యతను ఎలుగెత్తి చాటాలని నిర్ణయించారు. ఈ ర్యాలీల్లో విద్యార్థులు, యువత, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. ఈ ర్యాలీల కోసం ప్రతి జిల్లాకు 10 వేల జాతీయ జెండాలను అందించారు. ఈ కార్యక్రమం నిర్వహణ, పర్యవేక్షణకు నియోజవర్గానికి ఒక నోడల్‌ అధికారిని నియమించారు.

సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌లోని పబ్లిక్‌ గార్డెన్‌లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. అనంతరం బంజారాహిల్స్‌లో నిర్మించిన కుమ్రంభీం ఆదివాసీ భవన్‌, సంత్‌ సేవాలాల్‌ బంజారా భవన్లను సీఎం ప్రారంభిస్తారు. ఆ తరువాత ఎన్టీఆర్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

ఈ బహిరంగ సభకు పెద్ద ఎత్తున ఆదివాసి, గిరిజన తెగలకు చెందిన ప్రజలు హాజరయ్యే విధంగా ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు ఆర్టీసీ సేవలను సర్కారు వినియోగించుకోనున్నది. సభకు ముందుగా నెక్లెస్‌ రోడ్‌ నుంచి గుస్సాడీ, గోండు, లంబాడి తదితర 30 కళారూపాల కళాకారులతో భారీ ర్యాలీ జరుగనుంది.

- Advertisement -