టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పిన ఫెదరర్‌..

84
federeer
- Advertisement -

టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ టెన్నిస్‌కు వీడ్కోలు ప్రకటించాడు. ఈ నెల 23 నుంచి లండన్‌లో జరగనున్న లావెర్ కప్ ఏటీపీనే తన చివరి టోర్నమెంట్ అని వెల్లడించాడు. 1998లో టెన్నిస్ క్రీడలోకి అడుగుపెట్టిన రోజర్ ఫెదరర్ తన 24 ఏళ్ల కెరీర్లో ఎన్నో మైలురాళ్లు అందుకున్నారు.

20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్, ఎనిమిది వింబుల్డన్ ట్రోఫీలు, ఆరుసార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్, ఐదుసార్లు యూఎస్ ఓపెన్, ఒక ఫ్రెంచ్ ఓపెన్ టైటిళ్లు సాధించారు. 2008 బీజింగ్ ఒలింపిక్స్ డబుల్స్ విభాగంలో స్వర్ణం, 2012లో జరిగిన లండన్ ఒలింపిక్స్ సింగిల్స్ విభాగంలో రజత పతకం అందుకున్నాడు.

- Advertisement -