భారీ వర్షాల దృష్ట్యా బయటకి రాకండి : సీఎం కేసీఆర్‌

32
kcr
- Advertisement -

గత మూడు రోజులగా తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పోర్లుతున్నాయి. తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు జలశాయాల్లోకి వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. భారీ వర్షాల దృష్ట్యా అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని సీఎం కేసీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జిల్లాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల నాయకులు, ప్రజాప్రతినిధులు ప్రజల రక్షణ నిమిత్తం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

భద్రాచలం వద్ద గోదారమ్మ నీటి మట్టం 43 అడుగులకు చేరుకుంటుందనే అంచనాతో అధికారులు మొదటి ప్రమాద మహెచ్చరిక జారీ చేయనున్నారు. ప్రస్తుత 30అడుగుల వద్ద నది ప్రవహిస్తుందని జిల్లా కలెక్టర్‌ తెలిపారు.

ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారం వద్ద జంపన్న వాగు వరద నీటితో ఉప్పొంగి ప్రవహిస్తున్నది. వాగు పరిసర ప్రాంతాల్లో ఉన్న దుకాణాలు వరద నీటిలో మునిగిపోయాయి. నీటి ఉధృతి కారణంగా ముందస్తు చర్యల్లో భాగంగా పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

శ్రీరామ్‌ సాగర్‌ ప్రాజెక్టుకు (ఎస్‌ఆర్‌ఎస్పీ) ఎగువనుంచి కురుస్తున్న భారీ వర్షాలకు గోదారమ్మ ఉగ్రరూప దాల్చింది. శనివారం ఉదయం 25వేల క్యూసెక్కుల్లో ప్రవహించిన వరద ఇప్పుడు 3,20,000 క్యూసెక్కులకు చేరింది. ఎడతేరిపి లేని వర్షాల వల్ల మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరిలో గంటగంటకు నీటి మట్టం పెరుగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091అడుగులు కాగా, ప్రస్తుతం 1078 అడుగుల వద్ద ఉంది. జలాశాయం నీటి సామర్థ్యం 90టీంఎంసీలు ఇప్పుడు 49టీంఎసీలకు చేరుకుందని ఆధికారులు తెలిపారు.

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో చెరువులకు జలకళ వచ్చింది. జిల్లా వ్యాప్తంగా 95 చెరువులకు పైగా అలుగుపోస్తున్నాయి. నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తింది. ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 5980 క్యూసెక్కుల నీరు వస్తున్నది. పూర్తినీటి మట్టం 1405అడుగుల కాగా ప్రస్తుత 1329అడుగుల నీటి మట్టం ఉన్నది.

నిర్మల్‌ జిల్లాలోని కడెం ప్రాజెక్టు వరద భారీగా పెరిగి 59,716 క్యూసెక్కుల వరద నీరు చేరుకుంటుతోంది. దీంతో ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తి 23,297 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

పెద్దపల్లి జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద ప్రవహం తగ్గడం లేదు. దీంతో 20 గేట్లు ఎత్తి 1.31 లక్షల క్యూసెక్కుల నీటిని నదిలోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 20 టీఎంసీలు. ప్రస్తుతం 15.05 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.

నగరంలో వరుసగా మూడో రోజు ముసురు కొనసాగుతోంది. గత రెండు రోజుల్లో నగర వ్యాప్తంగా సగటున 8సెం.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని మాన్‌సూన్‌ బృందాలను అప్రమత్తం చేశామన్నారు. అలాగే జీహెచ్‌ఎంసీ అధికారుల సహాయం కోరకు040-21111111 టోల్‌ఫ్రీ నెంబర్‌కు పోన్‌ చేయాలని సూచించారు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌.

సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ అన్ని జిల్లాలోని అధికారులకు అదేశాలు జారీ చేశారు.  ముంపు ప్రాంతాల్లో అధికారులను, ఎన్డీఆర్‌ఎఫ్‌, రెస్క్యూ టీంలను అప్రమత్తం చేయాలని సూచించారు.  మహారాష్ట్రతోపాటు రాష్ట్రవ్యాప్తంగా రెడ్‌అలర్ట్‌ ఉన్నందున పరిస్థితులను ఎప్పటికప్పుడూ  సమీక్షించాలన్నారు.  
- Advertisement -