రాష్ట్రంలో కొత్త‌గా 116 కరోనా కేసులు..

138
corona
- Advertisement -

రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం కరోనా కేసుల వివరాలను వెల్లడించింది. దీని ప్ర‌కారం…గత 24 గంటల్లో తెలంగాణలో కొత్త‌గా 116 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా మ‌ర‌ణాలు సంభ‌వించ‌లేదు. అదే సమయంలో 165 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,98,923 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,95,387 మంది కోలుకున్నారు.

మృతుల సంఖ్య 1,634 గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 1,902 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 804 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్త‌గా 26 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.

- Advertisement -