దేశంలో కొత్తగా 15,510 కరోనా కేసులు నమోదు..

53
COVID-19 cases

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గినా.. పలు రాష్ట్రాల్లో మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 15,510 మంది కరోనా బారినపడ్డారు. దీంతో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,10,96,731కు చేరింది. ఇందులో 1,07,86,457 మంది వైరస్‌ నుంచి బయటపడగా, మరో 1,57,157 మంది మహమ్మారివల్ల మరణించారు. వైరస్‌ బారినపడినవారిలో 1,68,627 మంది ఇంకా చికిత్స పొందుతున్నారు.

కాగా, గత 24 గంటల్లో 106 మంది బాధితులు మరణించారు. మరో 11,288 మంది డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా వైరస్‌ వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి మొత్తం 21,68,58,774 నమూనాలకు కొవిడ్‌ పరీక్షలు నిర్వహించామని ఐసీఎమ్మార్‌ తెలిపింది. ఇందులో ఫిబ్రవరి 28న 6,27,668 మందికి పరీక్షలు చేశామని వెల్లడించింది. కాగా,కరోనా రెండో దశ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నేటి నుంచి మొదలవుతున్నది. అయితే ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,43,01,266 మంది వ్యాక్సిన్‌ తీసుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.