రాష్ట్రంలో కొత్తగా 3,527 కరోనా కేసులు నమోదు..

42
corona

తెలంగాణలో గత 24 గంటల్లో 97,236 కరోనా పరీక్షలు నిర్వహించగా 3,527 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఇదే సమయంలో 3,982 మంది కోలుకున్నారు. 19 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసులు 5,71,044కు పెరిగాయి. వీరిలో 5,30,025 మంది కోలుకున్నారు. ఇంకా 37,793 యాక్టివ్‌ కేసులున్నాయి. ఈరోజు వరకు 3226 మంది మృతి చెందారు.

రాష్ట్రంలో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 519 మంది కొవిడ్ బారినపడ్డారు. నల్గొండ జిల్లాలో 218, ఖమ్మం జిల్లాలో 215, రంగారెడ్డి జిల్లాలో 207 కేసులు నమోదయ్యాయి. నిర్మల్ జిల్లాలో అత్యల్పంగా 15 కేసులు గుర్తించారు. రాష్ట్రంలో కొవిడ్‌ రికవరీ రేటు 92.81 శాతంగా ఉంది. మరణాలు రేటు 0.56 శాతంగా ఉందని పేర్కొంది.