కేంద్రం తీరుపై మంత్రి కేటీఆర్ ధ్వజం..

149
minister ktr
- Advertisement -

దేశంలో ఉత్పత్తి అవుతున్న టీకాల్లో 85 శాతం కేంద్రం తన ఆదీనంలోకి తీసుకోవడం దురదృష్టకరం అన్నారు మంత్రి కేటీఆర్. శుక్రవారం ఆయన వేములవాడ నియోజకవర్గ కేంద్రంలో ప్రజలకు అత్యాధునిక సదుపాయాలతో మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో 22 కోట్ల రూపాయలతో నిర్మించిన 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రిని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. జిల్లాలో వేములవాడ ఆసుపత్రితో కలిపి 500 పడకలు అందుబాటులోకి వచ్చాయి అని అన్నారు. వేములవాడ ఆస్పత్రిలో 50 పడకలతో కోవిడ్ వార్డు సిద్ధం చేశామని, అన్ని రకాల వైద్య సేవలతో పాటు మందులు కూడా సిద్ధం చేశాం అని తెలిపారు. ఆరోగ్య సర్వేలో జిల్లాలో జ్వరం ఉన్నవారికి 3,900 మందిని గుర్తించి కిట్లు అందజేశామన్నారు. సిరిసిల్ల తరహాలో వేములవాడలో కూడా 40 లక్షల రూపాయలతో ఆక్సిజన్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తామని తెలిపారు.

ktr

కరోనా వచ్చి తగ్గిన వారికి వస్తున్న బ్లాక్ ఫంగస్ వైట్ ఫంగస్ బాధితుల కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ, యాంటీ ఫంగల్ మందులను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. ఇంకా వైద్య నిపుణులు సూచించిన మందులు, ఇతర వైద్య సేవలను ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని తెలిపారు.

దేశంలో ఉత్పత్తి అవుతున్న టీకాల్లో 85 శాతం కేంద్రం తన ఆదీనంలోకి తీసుకోవడం దురదృష్టకరం. కేవలం 15 శాతంలోనే రాష్ట్ర ప్రభుత్వాలు,ప్రైవేటు ఆస్పత్రులు కొనుక్కోవాలని కేంద్రం నిబంధన పెట్టింది. ఇతర దేశాలకు టీకాలను ఎగుమతి చేయకుండా ఉంటే మన ప్రజలకు టీకాలు అందేవి అని మంత్రి కేంద్రాన్ని విమర్శించారు. టీకాల విషయంలో రాష్ట్రాల పాత్ర లేకుండా పోయింది’’ అని కేటీఆర్‌ అన్నారు.

- Advertisement -